నాగపూర్ : కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నాగపూర్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్‌తో సమావేశాన్ని నితిన్ గడ్కరీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆదివారం పంచుకున్నారు.
సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది. ఈ చిత్రంలో సంజయ్ నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ షకేజీఎఫ్ చాప్టర్ 1″ కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ స్టార్ యష్, తమన్నా భాటియా, అనంత్ నాగ్ లతో కలిసి సంజయ్ నటించారు. అదేవిధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజయ్ కనిపించనున్నాడు. సంజయ్ దత్ గతేడాది క్యాన్సర్ గురయ్యారు. అక్టోబరులో వ్యాధినుంచి కోలుకున్నట్లు ప్రకటించారు.