మంగళవారం 31 మార్చి 2020
National - Feb 27, 2020 , 02:28:32

ఉక్కుపాదంతో అణచివేయండి

ఉక్కుపాదంతో అణచివేయండి
  • లేకపోతే రాజీనామా చేయండి.. కేంద్రంపై మండిపడిన రజనీకాంత్‌

చెన్నై: ఢిల్లీ అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని, లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కేంద్రంపై మండిపడ్డారు. దేశ రాజధానిలో హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై బుధవారం ఆయన స్పందించారు. ‘కచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం. అమెరికా అధ్యక్షుడు (ట్రంప్‌) మన దేశాన్ని సందర్శించినప్పుడు నిఘా వ్యవస్థలు తమ విధులు సక్రమంగా నిర్వహించలేదు. అల్లర్లను కేంద్రం ఉక్కుపాదంతో అణచివేయాల్సింది. నిఘా వైఫల్యమంటే కేంద్ర హోంమంత్రి వైఫల్యమే. ఉక్కుపాదంతో అణచివేయాలి లేదా రాజీనామా చేసి తప్పుకోవాలి. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ఆయన అన్నారు.


logo
>>>>>>