మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 22:57:04

క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన ఐశ్వ‌ర్యారాయ్‌

క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన ఐశ్వ‌ర్యారాయ్‌

ముంబై: ప‌్ర‌ముఖ న‌టి, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ‌చ్చ‌న్ కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ ఆస్ప‌త్రిలో చేరారు. గ‌త ఆదివారం అమితాబ‌చ్చ‌న్ కుటుంబంలో ఆయ‌న స‌తీమ‌ణి జ‌యాబచ్చ‌న్ మిన‌హా మిగ‌తా అంద‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే అమితాబ్‌, అభిషేక్‌ల‌లో కొన్ని క‌రోనా వైర‌స్‌ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వారు అప్పుడే ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేరారు. అయితే ఐశ్వ‌ర్యారాయ్‌, ఆమె కూతురు ఆరాధ్య మాత్రం వైర‌స్ ల‌క్ష‌ణాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. 

అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో ఐశ్వ‌ర్యారాయ్ కూడా త‌న కూత‌రు ఆరాధ్య‌తో క‌లిసి.. ఆమె భ‌ర్త‌, మామ ఉన్న నానావ‌తి ఆస్ప‌త్రిలోనే చేరారు. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేష్ తోపే ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo