శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 11:05:36

ఏపీలో కంటైన్మెంట్లలో మినహా అన్ని చోట్లా కార్యకలాపాలు

ఏపీలో కంటైన్మెంట్లలో మినహా అన్ని చోట్లా కార్యకలాపాలు

అమరావతి : లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా కార్యకలాపాలకు అనుమతి తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాల నిర్వహణకు అనుమతి తెలిపింది. సరి-బేసి సంఖ్యలో దుకాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.


logo