మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 12:32:56

ఈశాన్య భారత్‌లో చురుకుగా రుతుపవనాలు.. పొంగి పొర్లుతున్న గంగా, యమునా నదులు

ఈశాన్య భారత్‌లో చురుకుగా రుతుపవనాలు.. పొంగి పొర్లుతున్న గంగా, యమునా నదులు

న్యూ ఢిల్లీ : రుతుపవనాలు చురుకుగా కదులుతున్న కారణంగా నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. అసోం, బీహార్ నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండగా, గంగా, యమునా నీటిమట్టం కూడా నిరంతరం పెరుగుతోంది. సంగం నగరం ప్రయాగరాజ్‌లో గంగా, యమునా నదుల నీటి మట్టం గత 3 రోజులుగా పెరుగుతోంది. సంగంలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా, యాత్రికులు, నావికులు, ఘాట్లలో నివసించే భక్తులను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో పాటు, నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి గంగా, యమునా నదుల నీటి మట్టంపై 24 గంటల పర్యవేక్షణ జరుగుతోంది.

గంగా, యమునా నదులు రెండూ ప్రస్తుతం ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. కానీ గత 24 గంటల్లో గంగా నది నీటిమట్టం 10 సెం.మీ, యమునా నీటిమట్టం 16 సెం.మీ పెరిగింది. సంగంలోని గంగా, యమునా నదులు 84.734 మీటర్లు దాటితో ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అర్థం. సోమవారం, గంగా నది నీటిమట్టం ఫాఫామౌ వద్ద 77.850 మీటర్లు, చాట్నాగ్ వద్ద 73.470 మీటర్లుగా నమోదైంది. కాగా, యమునా నది నీటిమట్టం నైనిలో 74.02 మీటర్ల వద్ద నమోదైంది.  

వర్షం నీరు, టెహ్రీ, నరోరా గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల గంగానది నీటిమట్టం పెరుగుతోంది. కెన్, బెట్వా, చంబల్ నదుల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల యమునా నది నీటిమట్టం పెరుగుతోంది.

అదే విధంగా అసోంలో వరదలు వినాశనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. సోమవారం ఇక్కడ భారీ వర్షాల కారణంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా ఇక్కడ సుమారు 22 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డిపార్ట్మెంట్ ప్రకారం రుతుపవనాలు వేరే మార్గంలో ప్రయాణిస్తున్నాయని, ప్రస్తుతం దక్షిణ దిశగా వేగంగా కదులుతున్నాయని, ఈశాన్య భారతదేశంలో వర్షం తగ్గుతుందని వాతావరణ శాఖ తెలుపడంతో అసోం ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

పశ్చిమ తీరంలో గోవా కేరళ వరకు రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. స్కైమెట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం జూలై 16 నాటికి ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి హెచ్చరిక జారీ చేయబడింది. ముంబైతో పాటు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గుజరాత్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, కర్ణాటకలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి. ఇక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఈ రోజు వాతావరణం పొడిగా ఉండటానికి అవకాశం ఉన్నందున ఢిల్లీలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo