ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 15, 2020 , 19:50:02

కర్ణాటకలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు

కర్ణాటకలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటగా, పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,265కు, మరణాల సంఖ్య 7,481కు చేరింది. గత 24 గంటల్లో 7,406 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,69,229కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,06,036 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo