శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 05, 2020 , 12:20:48

యాక్టివ్ కేసులు.. 14వ రోజూ 10 ల‌క్ష‌ల క‌న్నా త‌క్కువే

యాక్టివ్ కేసులు.. 14వ రోజూ 10 ల‌క్ష‌ల క‌న్నా త‌క్కువే

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల్లో ఇండియా కొత్త మైలురాయిని అందుకున్న‌ది. వ‌రుస‌గా 14వ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల క‌న్నా త‌క్కువ న‌మోదు అయ్యాయి.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌డుతున్న టెస్ట్‌, ట్రాక్‌, ట్రేస్, ట్రీట్ టెక్నాల‌జీ విధానం వ‌ల్ల వైర‌స్ కేసులు త‌క్కువ సంఖ్య‌లో న‌మోదు అవుతున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో 76,737 మంది వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ తెలిపింది.  కొత్త‌గా న‌మో6దు అయిన కేసుల సంఖ్య కేవ‌లం 74,442 మాత్ర‌మే.  కొత్త‌గా న‌మోదు అయిన కేసుల క‌న్నా.. కొత్త‌గా రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది.  భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల కోలుకున్న వారి సంఖ్య 55,86,70కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 903 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. 82 శాతం మ‌ర‌ణాలు ప‌ది రాష్ట్రాల నుంచి న‌మోదు అయ్యాయి.