ఈడీ నోటీస్ పిరికిపంద చర్య.. డోంట్‌కేర్ అన్న సంజయ్ రౌత్

ముంబై: పీఎంసీ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని తన భార్య వర్షకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం తెలిపారు. ఇటువంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు. గృహిణిగా ఉన్న ఒక మహిళను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపంద చర్య అని, ఇటువంటి వాటిని లెక్కచేయబోమని పేర్కొన్నారు. ఈడీ నోటీసులకు తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు.
ఈడీకి కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంది, సకాలంలో వాటిని సమర్పిస్తామని చెప్పారు. ఇంతకుముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తోపాటు పలువురు రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు పంపిందని ఆ నేతల పేర్లు సంజయ్ రౌత్ సోదాహరణంగా వెల్లడించారు. గతేడాది శరద్ పవార్, ఏక్నాథ్ ఖాడ్సే, ప్రతాప్ సర్నాయక్ తదితరులకు నోటీసులు వచ్చాయని, వీరంతా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారేనని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మెక్సికో ప్రెసిడెంట్‌కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?