శుక్రవారం 05 జూన్ 2020
National - May 19, 2020 , 15:57:33

టిక్‌టాక్‌ స్టార్‌పై మండిపడ్డ లక్ష్మి అగర్వాల్‌

టిక్‌టాక్‌ స్టార్‌పై మండిపడ్డ లక్ష్మి అగర్వాల్‌

ఫైజాల్‌ సిద్దిఖీ ఫేమస్‌ టిక్‌టాక్‌ స్టార్‌. ఇతను చేసే ప్రతి వీడియో చాలా పాపులర్‌ అవుతుంది. ఇతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇటీవల అతను చేసిన ఓ వీడియోపై యాసిడ్‌ ఆటాక్‌ సర్వైవర్‌ లక్ష్మి అగర్వాల్‌ మండిపడింది. ‘ఒక అమ్మాయిపై యాసిడ్‌ పోసి అతను మాత్రం నవ్వుతూ ఉంటాడు’. ఇది రియల్‌ కాదు. జస్ట్‌ వీడియో కోసం ఇలా చేశారు. ‘ఈ నటనకి ఫిదా అయి అభిమానులు దాన్నే ఫాలో అయితే బలయ్యేది అమ్మాయిలు. పాపులారిటీ కోసం ఏమైనా చేస్తారా? ఫేమ్‌ కోసం ఇలాంటి వీడియోలను ప్రోత్సహిస్తే సహించేది లేదంటూ’ ఫైజాల్‌పై, లక్ష్మి మండిపడింది. అంతేకాదు.. ఈ వీడియోను బిజెపి నాయకుడు తాజిందర్‌ బాగ్గా  నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్‌సిడబ్లూ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.logo