శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 20, 2021 , 11:10:19

జ‌ల్పాయ్‌గురి మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

జ‌ల్పాయ్‌గురి మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం జ‌ల్పాయ్‌గురిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 13 మంది మృతిచెంద‌డం తీవ్ర మ‌నోవేద‌న క‌లిగించింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఇంత‌టి బాధాక‌ర‌మైన స‌మ‌యంలో మృతుల కుటుంబాల‌కు ధైర్యాన్ని ఇవ్వాల‌ని, గాయ‌ప‌డినవారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. అదేవిధంగా గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి రూ.50 చొప్పున అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధాని కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo