బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 11:09:49

క‌ర్నాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం.. 13 మంది మృతి

క‌ర్నాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం.. 13 మంది మృతి

హైద‌రాబాద్‌:  క‌ర్నాట‌క‌లోని తుమ‌కూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారును ఎస్‌యూవీ వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది మ‌ర‌ణించారు.  మ‌రో అయిదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.  తుమ‌కూరు జిల్లాలోని కునిగ‌ల్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  మ‌ర‌ణించిన వారిలో ప‌ది మంది త‌మిళ‌నాడుకు చెందిన‌వారు కాగా, మ‌రో ముగ్గురు బెంగ‌ళూరుకు చెందిన‌వారు ఉన్నారు. క‌ర్నాట‌క‌లోని ధ‌ర్మ‌స్థ‌లంలో ఉన్న ఆల‌య ద‌ర్శ‌నం కోసం ప్ర‌యాణికులంతా వెళ్తున్నారు. చ‌నిపోయిన‌వారిలో అయిదుగురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు.   logo