సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 11:31:42

ముగ్గురి ప్రాణాలు బ‌లిగొన్న బైక్‌రేస్‌

ముగ్గురి ప్రాణాలు బ‌లిగొన్న బైక్‌రేస్‌

రోడ్లు ఖాళీగా ఉన్నాయంటే చాలు యూత్ రెచ్చిపోతారు. బైక్ స‌రిగా రాని వాళ్లు కూడా అమాంతం వేగం పెంచి ఎదుటివాళ్ల‌కు హాని క‌లిగిస్తుంటారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ బైక్ రేస్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ‌ల్లారి రోడ్డు కొంచెం ఖాళీగా ఉండ‌డంతో ముగ్గురు యువ‌కులు బైక్ రేస్ పెట్టుకున్నారు. ఖాళీ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లారు.

మార్గ‌మ‌ధ్య‌లో ఒక‌రు అదుపు త‌ప్ప‌డంతో మ‌రొక‌రి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. వీరిలో ఇద్ద‌రు మైన‌ర్లు. మ‌రొక‌రికి 22 ఏండ్లు. రేస్ కోసం గంట‌కు 150 కి.మీ. వేగంతో ప్ర‌యాణించే విధంగా బైకుల‌కు వీలుగా ఇంజిన్లు మార్పించుకున్నార‌ని పోలీసులు తెలిపారు. logo