సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 14:36:16

క‌ర్నాట‌క ఆఫీస‌ర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీ మొత్తంలో బంగారం స్వాధీనం

క‌ర్నాట‌క ఆఫీస‌ర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీ మొత్తంలో బంగారం స్వాధీనం

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో ఆ రాష్ట్ర అధికారి ఇంట్లో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఆ త‌నిఖీల్లో భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క‌ర్నాట‌కలోని ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ‌యోటెక్నాల‌జీ శాఖ‌లో ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న సుధ ఇంట్లో ఇవాళ ఏసీబీ త‌నిఖీలు నిర్వ‌హించింది.  భూములు, బాండ్లు, షేర్ల‌లో ఆమె చేసిన పెట్టుబ‌డుల‌పై ఏసీబీ ఆరా తీస్తున్న‌ది. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు ఆమె ఇంటి నుంచి న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఓ ఫిర్యాదు ఆధారంగా.. కొడిగ‌హ‌ల్లిలోని ఆమె ఇంటిని, యెల‌హంక‌లోని ఫ్లాట్‌ను, మైసూరు, ఉడిపిల్లో ఉన్న ఇండ్ల‌ల్లోనూ ఏసీబీ సోదాలు చేసింది. బెంగుళూరు డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో ఆమె గ‌తంలో ల్యాండ్ అక్విజిష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసింది.