సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 19:33:49

ఆడియో టేపులపై ఏసీబీ కేసు

ఆడియో టేపులపై ఏసీబీ కేసు

జైపూర్ : అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నినట్లు వెలుగు చూసిన రెండు ఆడియో క్లిప్‌లపై రాజస్థాన్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం కేసు నమోదు చేసింది. శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అవినీతి నిరోధకశాఖ డీజీ అలోక్‌ త్రిపాఠి పేర్కొన్నారు. సంజయ్‌ జైన్‌, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ జరిపిన సంభాషణ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సంజయ్‌ జైన్‌ బీజేపీ నాయకుడని కాంగ్రెస్‌ ఆరోపించగా, తమకు ఎలాంటి సంబంధం లేదని కాషాయ పార్టీ స్పష్టం చేసింది. ఆడియో క్లిప్‌లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరికి పరీక్ష కోసం పంపనున్న ట్లు పోలీస్‌ అధికారి విలేకరులతో అన్నారు.  ఏసీబీకి ముందు రాజస్థాన్‌ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) శుక్రవారం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, రాత్రి ఒక కేసులో సంజయ్‌ జైన్‌ను అరెస్టు చేసింది.  కాగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు శాసన సభ్యుల హార్స్‌ ట్రేడింగ్‌పై వైరల్‌ అయిన ఆడియోలో జైన్‌ పేరు వెలుగు చూసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo