సోమవారం 25 జనవరి 2021
National - Jan 01, 2021 , 18:32:57

కంటైనర్‌లోకి దూసుకెళ్లిన ఏసీ బస్సు.. ఐదుగురు దుర్మరణం

కంటైనర్‌లోకి దూసుకెళ్లిన ఏసీ బస్సు.. ఐదుగురు దుర్మరణం

ఉన్నవ్‌ :  ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నవ్‌  జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్‌ స్లీపర్‌ క్లాస్‌ ఏసీ బస్సు అదుపుతప్పి కంటైనర్‌లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. లక్నో - ఆగ్రా జాతీయ రహదారిపై ఔరాస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మౌనిభావ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

బీహార్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  మౌనిభావ గ్రామం వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న స్టేషనరి సామగ్రి కంటైనర్‌ను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. పొగ మంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.  ప్రమాద సమయంలో బస్సులో 65 మంది నుంచి 70 మంది ప్రయాణిస్తున్నారని  ఔరాస్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ రాజ్‌బహుదూర్‌ సింగ్‌ చెప్పారు. మృతులంతా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo