మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 13:47:08

ఒక్క‌రోజే 1.65 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు: ICMR

ఒక్క‌రోజే 1.65 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు: ICMR

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు జ‌డ‌లు విప్పుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య కూడా పెరుగుతూ వ‌స్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో  దేశంలో 1,65,412 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ICMR) వెల్ల‌డించింది. 

దేశంలో ఒకేరోజు 1.65 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసార‌ని ICMR తెలిపింది. కొత్త‌గా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 62,49,668 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్ల‌య్యింద‌ని ICMR ప్ర‌క‌టించింది. కాగా, దేశ‌వ్యాప్తంగా మొత్తం 953 ల్యాబోరేట‌రీల్లో క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అందులో 699 ప్ర‌భుత్వ ల్యాబొరేట‌రీలు కాగా, 254 ప్రైవేటు ల్యాబొరేట‌రీలు ఉన్నాయి.  

                  


logo