శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 10:20:10

వ‌రుస‌పెట్టి పేలిన 50 డైన‌మైట్లు, జిలాటిన్ స్టిక్స్‌

వ‌రుస‌పెట్టి పేలిన 50 డైన‌మైట్లు, జిలాటిన్ స్టిక్స్‌

శివ‌మొగ్గ‌:  లారీలో తీసుకువెళ్తున్న డైన‌మైట్లు ఒక్క‌సారిగా పేలాయి.  ఆ వాహ‌నంలో ఉన్న జిలాటిన్ స్టిక్స్ కూడా బెంబేలెత్తించాయి.  ట్రక్కులో ఉన్న సుమారు 50 డైన‌మైట్లు వ‌రుస‌గా పేలుతూ బీభ‌త్సం సృష్టించాయి. ఆ పేలుళ్ల ధాటికి బీహార్‌కు చెందిన 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని శివ‌మొగ్గ‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్న‌ది.  డైన‌మైట్ల‌తో వెళ్తున్న లారీ పూర్తిగా ధ్వంస‌మైంది.  క్వారీ నుంచి వెలుబ‌డిన భారీ శ‌బ్ధాల‌ను తాను కూడా విన్న‌ట్లు శివ‌మొగ్గ ఎమ్మెల్యే అశోక్ నాయ‌క్ తెలిపారు.  డైనమైట్ల పేలుడ వ‌ల్ల ఆ ప్రాంతం అంతా ద‌ట్ట‌మైన పొగ‌తో క‌మ్ముకుపోయింది.  కొన్ని క్ష‌ణాల పాటు ఏమీ క‌నిపించ‌కుండాపోయింద‌ని, క‌నీసం 15 మంది మృతిచెందార‌ని, మృతుల‌కు సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఎమ్మెల్యే తెలిపారు.   

ఉన్న‌త స్థాయి విచార‌ణ‌..

రాళ్ల క్వారీ వ‌ద్ద రాత్రి 10.30 నిమిషాల‌కు.. జిలాటిన్ స్టిక్స్‌, డైన‌మైట్ల‌తో వెళ్తున్న లారీలో పేలుడు జ‌రిగింది.  శివ‌మొగ్గ‌తో పాటు చిక్‌మ‌గ‌లూరు, ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఆ పేలుళ్ల శ‌బ్ధం వినిపించిన‌ట్లు తెలుస్తోంది.  దీంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.  డైన‌మైట్ల పేలుళ్ల వ‌ద్ద భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మానిట‌రింగ్ సెంట‌ర్ పేర్కొన్న‌ది. సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప స్వంత ప‌ట్ట‌ణం శివ‌మొగ్గ‌.  అయితే ఈ విషాదం గురించి ఆయ‌న‌కు తెలియ‌జేశారు. ఈ ప్రాంతంలో అక్ర‌మంగా క్వారీలు నిర్వ‌హించ‌డం స‌ర్వ‌సాధ‌ర‌ణం అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. హున‌సోడు గ్రామంలో జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు సీఎం ఆదేశించారు.  పేలుడు జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు విజిట్ చేశారు. 

5 ఎక‌రాల్లో క్వారీ ప‌నులు..

రాత్రి పూట జ‌ర‌గ‌డంతో జ‌నం తీవ్ర ఆందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. భూకంపం వ‌చ్చిందో ఏమో అన్న భ‌యంతో ఇండ్ల నుంచి ప‌రుగులు తీశారు.  రాత్రి 11 గంట‌ల‌కు స్థానికంగా ఉన్న సెసిమాల‌జీ డేటా సెంట‌ర్ మాత్రం ఎటువంటి ప్ర‌కంప‌న‌ల‌ను చూప‌లేదు.  క్వారీ యూనిట్‌.. ఎస్ఎస్ స్టోన్ క్ర‌ష‌ర్‌కు చెందిన‌ట్లు గుర్తించారు.  21 ఎక‌రాల్లో ఆ క్వారీ యూనిట్ ఉన్న‌ది. ఆ యూనిట్ య‌జ‌మాని ఎస్‌టీ కుల‌క‌ర్ణి. అయితే 5 ఎక‌రాల్లోని స్థ‌లంలో ప్ర‌స్తుతం క్వారీ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీని కోసం 2019 నుంచి 2024 వ‌ర‌కు లైసెన్సు తీసుకున్నారు. సుధాక‌ర్ పేరుతో క్ర‌షింగ్ యూనిట్‌కు లైసెన్సు ఉన్న‌ది. ఎస్‌టీ కుల‌క‌ర్ణి కుమారుడు అవినాశ్ కుల‌క‌ర్ణితో పాటు సుధాక‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

VIDEOS

logo