గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 10:45:14

స్వదేశాలకు చేరిన సుమారు 1.25 లక్షల మంది భారతీయులు : హర్‌దీప్‌ పూరి

స్వదేశాలకు చేరిన సుమారు 1.25 లక్షల మంది భారతీయులు : హర్‌దీప్‌ పూరి

న్యూ ఢిల్లీ : విదేశాల్లోని భారతీయులు వందే భారత్‌ మిషన్‌ కింద సుమారు 1,25,000 మంది స్వదేశానికి వచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి మంగళవారం తెలియజేశారు. 

జూన్‌ 23న సుమారు 6037 మంది విదేశాల నుంచి ఇండియాకు తిరిగొచ్చినట్లు ఆయన తెలిపారు. వందే భారత్ మిషన్‌ ఒంటరిగా, నిరాశ్రయులుగా ఉన్న భారతీయులకు అండగా ఉంటుందని, గత నెలలో మిషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో చిక్కుకున్న 1.25 లక్షల మంది ఇండియాకు తిరిగొచ్చారన్నారు. ఇప్పటి వరకు సుమారు 43వేల విమానాలు భారత దేశం నుంచి బయల్దేరినట్లు హర్‌దీప్‌ పూరి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

కరోనా వైరస్‌ కారణంగా విదోశాల్లో చిక్కుకున్న భారతీయును రప్పించడానికి వందే భారత్‌ మిషన్‌ను మే 7న ప్రారంభించారు. ఇప్పటి వరకు మూడు దశల్లో విదేశాల నుంచి భారతీయులను రప్పించారు. తాజాగా జూన్‌11న మూడో దశ ప్రారంభమైంది. ఇందులో 191 ఫీడర్‌ విమానాలతో సహా మొత్తం 550 విమానాలున్నాయి. 


logo