గురువారం 28 జనవరి 2021
National - Dec 23, 2020 , 12:43:11

అభ‌య హ‌త్య కేసు.. దోషుల‌కు జీవిత ఖైదు

అభ‌య హ‌త్య కేసు.. దోషుల‌కు జీవిత ఖైదు

తిరువ‌నంత‌పురం : కేరళలో 28 ఏండ్ల నాటి సిస్టర్‌ అభయ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. అభయను క్యాథలిక్‌ చర్చి ఫాదర్‌ థామస్‌ కొట్టూర్‌, సిస్టర్‌ సెఫీ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని దోషులుగా నిర్ధారించింది. ఈ ఇద్ద‌రు దోషుల‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.   

21 ఏండ్ల అభయ కొట్టాయం బీసీఎం కళాశాలలో చదువుతుండేది. అక్కడే సెయింట్‌ పియోస్‌ కాన్వెంట్‌ హాస్టల్‌లో ఉండేది. మార్చి 27, 1992న కాన్వెంట్‌లోని బావిలో అభయ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు ఈ కేసును మూసేశారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. 

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం సెఫీతో కొట్టూర్‌, పూథ్రిక్కయిల్‌లకు అక్రమ సంబంధం ఉండేది. మార్చి 27, 1992న కొట్టూర్‌, సెఫీ శారీరకంగా సన్నిహితంగా ఉండటాన్ని అభయ చూసింది. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని నిందితులు అభయను గొడ్డలితో నరికి చంపి, బావిలో పడేశారు. గత ఏడాది ఆగస్టు 26న విచారణ మొదలవగా ప్రాసిక్యూషన్‌కు పలువురు సాక్షులు ఎదురుతిరిగారు. అయితే, హత్య జరిగిన రోజు కాన్వెంట్‌లో దొంగతనం చేయడానికి వెళ్లిన రాజు అనే ఓ దొంగ... అక్కడ కొట్టూర్‌, సెఫీని చూశానని సాక్ష్యం చెప్పాడు. రాజు ఒక్కడే మాట మార్చకుండా చివరిదాకా నిలబడ్డాడు. 

ఇవి కూడా చ‌ద‌వండి.. 

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు: బీజేపీ
ఐదేళ్ల బాలిక డెడ్‌బాడీపై లైంగిక‌దాడి
క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ
logo