శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 17:15:27

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-4 అప్‌డేట్స్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-4 అప్‌డేట్స్‌

ఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-4ను ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌ ద్వారా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, అంతరిక్ష నిర్వహణ, విమానాశ్రయాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు, అటామిక్‌ ఎనర్జీ రంగాలకు ప్యాకేజీని ప్రకటించారు. 

మైనింగ్‌పై ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగింపు....

- ఖనిజ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తొలగిస్తూ వాణిజ్య మైనింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు

- బొగ్గుపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తీసివేస్తూ రెవెన్యూ షేరింగ్‌ మెకానిజంకు అవకాశం కల్పిస్తూ వాణిజ్య మైనింగ్‌ను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు

- 50 బ్లాక్‌లకు బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు

- బొగ్గు గనులకు సైతం వేలం నిర్వహిస్తామన్నారు

- ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 


 విమానయాన రంగంలో భారీ సంస్కరణలు..

- విమానయాన రంగంలో కేంద్రం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది

- భారతీయ ఏరోస్పేస్‌ రూట్ల హేతుబద్దీకరణ

- పీపీపీ భాగస్వామ్యంతో మరో 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి

- రూ. 13 వేల కోట్లతో 12 నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి నిర్ణయం

- ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఏఏఐకు రూ. 2,300 కోట్ల నిధులు

- విమాన మరమ్మతుల హబ్‌గా భారత్‌ను తీర్చేదిద్దే ప్రయత్నం

- ఎంఆర్‌వో హబ్‌ల్లో దేశీయ, విదేశీ విమానాలకు, యుద్ధ విమానాలకు మరమ్మతులు

అంతరిక్ష రంగంలోనూ అవకాశాల కల్పన...

- అంతరిక్ష పరిశోధనారంగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం  

- లెవల్‌ ఫ్లేయింగ్‌ ఫీల్డ్‌ కల్పించే విధంగా సంస్కరణలు

- జియో స్పేషియల్‌ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు. భారతీయ స్టార్టప్‌లకు ప్రోత్సాహం

దేశీయ రక్షణ ఉత్పత్తి సంస్థల బలోపేతం...

- రక్షణ సామాగ్రి కోసం విదేశాలపై ఆధారపడకుండా చర్యలు

- స్వావలంబన మార్గంలో మేక్‌ ఇన్‌ ఇండియాది కీలకపాత్రన్న కేంద్రం ఇకపై నిర్దేశించిన ఆయుధ సామాగ్రి దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. 

- ఇకపై నిర్దేశిత జాబితాలోని సామాగ్రి, విడిభాగాలు దేశంలోనే తయారీ

- ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరెజేషన్‌ చేయాలని నిర్ణయం. అంటే ప్రైవేటుకు అప్పగించడం కాదని.. స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేయడమన్నారు. 

విద్యుత్‌ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు...

- విద్యుత్‌ రంగంలో స్థిరత్వం తీసుకొచ్చే సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది

- విద్యుత్‌ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు 

- కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ

- నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా ప్రయత్నాలు

- విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా చర్యలు

- మెడికల్‌ ఐసోటోప్‌ల ఉత్పత్తి నిమిత్తం పీపీఈ పద్ధతిలో రిసెర్చ్‌ రియాక్టర్‌ ఏర్పాటు. క్యాన్సర్‌, ఇతర వ్యాధులకు అందుబాటు ధరలో చికిత్స అందించేందుకు మానవత్వంతో ప్రభుత్వం చర్యలు. 

- నీటిపారుదల, క్షామపీడిత ప్రాంతాల గుర్తింపులో స్టార్టప్‌లకు ప్రోత్సాహం 


logo