శుక్రవారం 10 జూలై 2020
National - Jun 17, 2020 , 16:32:37

ఆప్‌ ఎమ్మెల్యే అతిషికి కరోనా పాజిటివ్‌

ఆప్‌ ఎమ్మెల్యే అతిషికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే అతిషి(39)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలో  కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. స్వల్పంగా జ్వరంతో పాటు దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠేకు  కరోనా సోకినట్లు  బుధవారం వైద్య పరీక్షల్లో తేలింది. ఆప్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు విశేష్‌ రవి(కరోల్‌ బాగ్‌), రాజ్‌కుమార్‌ ఆనంద్‌(పటేల్‌ నగర్‌)కి కరోనా సోకిన విషయం తెలిసిందే. 


logo