ఆదివారం 29 మార్చి 2020
National - Feb 23, 2020 , 15:59:21

యూపీ ఎన్నికలవైపు ఆప్‌ చూపు...

యూపీ ఎన్నికలవైపు ఆప్‌ చూపు...

లక్నో: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. విక్టరీ విజయంతో ఫుల్‌జోష్‌ మీదున్న ఆప్‌ చూపు ఇప్పుడు మినీ ఇండియా అయిన ఉత్తరప్రదేశ్‌పై పడింది. యూపీలో 2022 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.  దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక యూపీలో తన పార్టీని విస్తరించాలని ప్రణాళిక రచిస్తోంది. ఆప్‌ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ చెప్పుకునే గుజరాత్‌ మోడల్‌కు, ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నమూనాలకు అసలు పొంతనే లేదని అన్నారు. ఢిల్లీ చేస్తున్న అభివృద్ధి పనుల ఎజెండాతో యూపీలో క్షేత్రస్థాయిలో ఆప్‌ విస్తృతపరిచేందుకు ప్రణాళిక ప్రారంభించామన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ మోడల్‌ డెవలప్‌మెంట్‌తో యూపీ ప్రజలను ఓట్లను అడుగుతామని సంజయ్‌ సింగ్‌ తెలిపారు. 


logo