శుక్రవారం 03 జూలై 2020
National - Feb 04, 2020 , 15:39:30

పారిశుద్ద్య కార్మికుడు చనిపోతే కోటి నష్టపరిహారం..

పారిశుద్ద్య కార్మికుడు చనిపోతే కోటి నష్టపరిహారం..

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలో ప్రతీ కుటుంబాన్ని సంపన్న కుటుంబంలా తీర్చిదిద్దేలా మేనిఫెస్టో రూపొందించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా తాము పనిచేస్తామని ఈ సందర్బంగా తెలిపారు. 

ఆప్‌ మేనిఫెస్టోలోని అంశాలు..

* నాణ్యమైన వైద్యం, విద్య, శుద్దమైన తాగునీరందించడం, 24 గంటల విద్యుత్‌ సరఫరా

* ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల సరఫరా చేయడం, 

* 10 లక్షల మంది వయోవృద్ధులకు ఉచిత తీర్థయాత్ర సౌకర్యం కల్పించడం, 

* పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉండగా చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా

* ప్రజలకు 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉంచటం (పైలట్‌ ప్రాజెక్టు) 


logo