బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 19:48:18

డాక్టర్ సూసైడ్ కేసు..ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

డాక్టర్ సూసైడ్ కేసు..ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: డాక్టర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ కు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఏప్రిల్ 18న దక్షిణ ఢిల్లీలోని దుర్గా విహార్ ఏరియాలో రాజేంద్రసింగ్‌ (52)అనే వైద్యుడు ఆత్మహత్మ చేసుకున్న విషయం తెలిసిందే.

రాజేంద్రసింగ్ రాసిన సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ పేరు రాశాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను మే 9న అరెస్ట్‌ చేశారు. మే18వరకు కస్డడీ విధించింది. రేపటితో కస్టడీ ముగుస్తుండటంతో మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఈ కేసులో ఎమ్మెల్యే అనుచరుడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo