శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 08:34:13

ఢిల్లీలో కౌంటింగ్ షురూ.. ఆప్ జోరు

ఢిల్లీలో కౌంటింగ్ షురూ.. ఆప్ జోరు

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కాసేప‌టి క్రితం మొద‌లైంది.  ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. తాజా స‌మాచారం మేర‌కు ఆప్ పార్టీ ఏడు స్థానాల్లో ముందున్న‌ది. బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా ఆధిక్యంలో లేదు. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వార‌కా, జాన‌కీపూర్‌, కృష్ణ న‌గ‌ర్‌, గోండా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న‌ది. వివాదాస్ప‌ద బీజేపీ నేత క‌పిల్ మిశ్రా.. మోడ‌ల్ టౌన్ సీటు నుంచి ఆధిక్యంలో ఉన్నారు.  ఢిల్లీ ఎన్నిక‌లు.. ఇండో పాక్ స‌మ‌రం అని ప్ర‌చారం స‌మ‌యంలో క‌పిల్ మిశ్రా కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అత‌నిపై ఎన్నిక‌ల సంఘం 48 గంట‌ల నిషేధం విధించింది.  మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.  అయితే సీఎం కేజ్రీవాల్‌.. హ్యాట్రిక్ విజ‌యం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.  


logo