గురువారం 02 జూలై 2020
National - Jun 19, 2020 , 14:43:34

నువ్వొక్క‌డివే నిన‌దిస్తే దేశం వృద్ధి చెంద‌దు: ప‌్ర‌ధానిపై ఆప్ ఆగ్ర‌హం

నువ్వొక్క‌డివే నిన‌దిస్తే దేశం వృద్ధి చెంద‌దు: ప‌్ర‌ధానిపై ఆప్ ఆగ్ర‌హం

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై ఆమ్ఆద్మీ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది. గ‌ల్వాన్ లోయలో భార‌త‌-చైనా బ‌ల‌గాల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ సాయంత్రం ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో జ‌రుగనున్న అఖిల‌ప‌క్ష స‌మావేశానికి త‌మ పార్టీని ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఆప్ నేత సంజ‌య్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అహంభావ‌పూరిత వైఖ‌రిని అవ‌లంబించ‌డం మంచిది కాద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. 

ప్ర‌స్తుత స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేపథ్యంలో దేశం యావ‌త్తు ఐక‌మ‌త్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. స‌బ్‌కా సాత్ స‌బ్‌కా వికాస్ అని నువ్వొక్క‌డివే నిన‌దిస్తావు. కానీ ప్ర‌తి ఒక్క‌రిని క‌లుపుకునిపోవు. నువ్వొక్క‌డివే నిన‌దిస్తే దేశం వృద్ధి చెంద‌దు అని సంజ‌య్ సింగ్ ప్ర‌ధానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అఖిల‌ప‌క్షానికి త‌మ పార్టీని ఆహ్వానించ‌క‌పోవ‌డం ప్ర‌ధాని ఒంటెద్దు పోక‌డ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.    ‌logo