బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 14:31:51

ఆధిక్యంలో రాఘవ్‌ చధా..ఆప్ కార్యకర్తల సంబురాలు

ఆధిక్యంలో రాఘవ్‌ చధా..ఆప్ కార్యకర్తల సంబురాలు

న్యూఢిల్లీ: సోషల్‌మీడియా వేదికగా ప్రచారంలో దూసుకెళ్లి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాఘవ్‌ చధా విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రాజిందర్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాఘవ్‌ చధా 18వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజిందర్‌ నగర్‌ స్థానంలో ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఆర్‌పీ సింగ్‌, ఆప్‌ అభ్యర్థి రాఘవ్‌ చధా మధ్య పోటీ కొనసాగుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రాకీ టుషీద్‌ (జాట్‌ కమ్యూనిటీ)వెనుకంజలో ఉన్నారు. తాజా ఫలితాలను చూస్తే రాఘవ్‌ విజయం దాదాపు ఖాయమైపోయినట్లేనని స్పష్టమవుతోంది. 

రాఘవ్‌చధా ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆయన అనుచరులు, మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆప్‌ కార్యకర్తల మధ్య సంబురాలు జరుపుకుంటోన్న ఫొటోలను రాఘవ్‌ చధా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా కెరీర్‌ ప్రారంభించి రాజకీయాల్లో ప్రవేశించిన రాఘవ్‌ చధా (31) ఆప్‌ అభ్యర్థుల్లో పిన్న వయస్కుడు. ఎన్నికల ప్రచారంలో రాఘవ్‌ చధాకు సోషల్‌మీడియా ఫాలోవర్ల నుంచి మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చినట్లు ఆయన వ్యక్తిగత టీం తెలిపిన సంగతి తెలిసిందే. logo
>>>>>>