బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 20:11:46

2022 మార్చికల్లా ఏడు రన్‌వేల అప్‌గ్రేడ్‌కు యోచన

2022 మార్చికల్లా ఏడు రన్‌వేల అప్‌గ్రేడ్‌కు యోచన

న్యూఢిల్లీ : 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఏడు విమానాశ్రయాలలో రన్‌వేలను అప్‌గ్రేడ్ చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) యోచిస్తున్నది. అప్‌గ్రేడ్‌ చేయాలని తలపెట్టిన ఏడు విమానాశ్రయాల్లో జమ్ము (జమ్ముకశ్మీర్‌), కొల్లాపూర్ (మహారాష్ట్ర), జబల్పూర్ (మధ్యప్రదేశ్), బారాపాని (మేఘాలయ), కడప (ఆంధ్రప్రదేశ్), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), ట్యుటికోరిన్ (తమిళనాడు) ఉన్నాయి. ఈ విషయాన్ని ఏఏఐకి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

జమ్ము విమానాశ్రయంలోని రన్‌వే ప్రస్తుత పొడవు 2,042 మీటర్ల నుంచి 2,438 మీటర్లకు విస్తరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని పూర్తి చేయాలని యోచిస్తున్నారు. కొల్లాపూర్ విమానాశ్రయం రన్‌వేను 1,370 మీటర్ల నుంచి 2,300 మీటర్లకు పొడిగించడం ప్రారంభించగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. జబల్పూర్ విమానాశ్రయం, ట్యుటికోరిన్ విమానాశ్రయంలోని రన్‌వేలు వరుసగా 2021 డిసెంబర్, 2022 మార్చి నాటికి అప్‌గ్రేడ్ కానున్నాయి. ట్రాఫిక్ డిమాండ్, ఇతర అంశాలపై ఆధారపడి విమానాశ్రయం యొక్క రన్వే ఒక నిర్దిష్ట రకం విమానాల కోసం రూపొందించబడిందని అధికారులు వివరించారు. "ట్రాఫిక్ పెరిగేకొద్దీ, ఎయిర్లైన్స్ ఆపరేటర్లు విమానాశ్రయం నుంచి పెద్ద విమానాలను నడపాలని కోరుకుంటారు. ఆ సమయంలో రన్వేను ఆ ప్రయోజనం కోసం అనువుగా ఉండేలా అప్‌గ్రేడ్ చేయాలి" అని ఒక అధికారి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బరపాణి విమానాశ్రయంలోని రన్‌వేను విస్తరించి బలోపేతం చేస్తామని అధికారులు తెలిపారు. కడప విమానాశ్రయం యొక్క రన్‌వేను కూడా విస్తరించి బలోపేతం చేయనున్నారు. 2021 మార్చి నాటికి పనులు పూర్తికావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలోని రన్‌వేను ప్రస్తుత పొడవు 2,286 మీటర్ల నుంచి 3,810 మీటర్లకు 2021 డిసెంబర్ నాటికి విస్తరించనున్నారు. మొత్తంగా ఏడు విమానాశ్రయాల రన్‌వేలు 2022 మార్చి నాటికి అప్‌గ్రేడ్ చేయబడతాయి అని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


logo