బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 20:06:42

త్వరలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం!

త్వరలో దేశీయ విమాన సర్వీసులు  ప్రారంభం!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా  పూర్తిగా ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)  పేర్కొంది.  త్వరలో దేశీయ విమాన సర్వీలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నందున ఏఏఐ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఏఏఐ సూచనలను తప్పకుండా పాటించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. సహచర ప్రయాణికులతో కనీసం నాలుగు ఫీట్లు భౌతిక దూరం పాటించాలని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేముందు బోర్డింగ్‌ పాస్‌/కార్డు కాపీని ప్రింట్‌ తీసుకొని రావాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ వెంట తీసుకెళ్లాలని సూచించింది. ఎయిర్‌పోర్టు సిబ్బందికి సహకరించాలని కోరింది. 


logo