శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 13:25:57

స్క్రీన్‌షాట్ తో డబ్బులు కొట్టేసి.. భలేగా దొరికాడు...!

 స్క్రీన్‌షాట్ తో డబ్బులు కొట్టేసి.. భలేగా దొరికాడు...!

రామ్‌గఢ్ : ఎదుటివాళ్లను మోసం చేసి సంబర పడ్డాడు... అంతలోనే బుక్కాయాడు. పాత ఆన్‌లైన్ చెల్లింపునకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించి ఓ యువకుడు షాపు యజమానిని బురిడీకొట్టించేందుకు యత్నించిన వైనమిది. ఎంతకీ తన ఖాతాలో డబ్బులు రాకపోవడంతో సదరు యజమాని పోలీసులను ఆశ్రయించి మాయగాడు ఆటకట్టించాడు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని 32 ఏండ్ల ఇషాన్ కుమార్ గిరిగా గుర్తించినట్టు రామ్‌గఢ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని ఛట్టీ బజార్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కాగా అతడితో పాటు ఉన్న మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. గతంలో చెల్లించిన ఓ పేమెంట్‌ను గిరి స్క్రీన్‌షాట్ తీసి దాచుకున్నాడనీ... తాజాగా మళ్లీ అదే రిసిప్ట్‌ను ప్రూఫ్‌గా చూపించి డబ్బులు కట్టినట్టు దుకాణాదారుడికి చూపించాడని పోలీసులు తెలిపారు. కాగా గిరిధ్ జిల్లాలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న పప్పూమండల్ అనే సైబర్ నేరగాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పప్పూ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు అత్యాధునిక వసతులతో ఇంద్రభవనంలా ఉన్న అతడి నివాసాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంట్లో సోదాలు నిర్వహించి లక్షలాది రూపాయల చెల్లింపులకు సంబంధించిన పలు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo