ఆదివారం 12 జూలై 2020
National - Jun 20, 2020 , 19:00:27

భ‌ర్త‌ను భుజాలపై మోస్తూ ఊరు చుట్టూ తిప్పింది.. ఎందుకో తెలుసా?

భ‌ర్త‌ను భుజాలపై మోస్తూ ఊరు చుట్టూ తిప్పింది.. ఎందుకో తెలుసా?

భోపాల్‌: ‌మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. వారం రోజుల‌పాటు క‌నిపించ‌కుండా పోయింద‌న్న కార‌ణంతో ఓ మ‌హిళ‌కు ఆమె భ‌ర్త సోద‌రులు వింత శిక్ష విధించారు. వారంపాటు బ‌య‌ట తిరిగి వ‌చ్చినందున త‌మ సోద‌రుడిని భుజాల‌పై ఎత్తుకుని ఊరు చుట్టూ తిప్పాల‌ని హుకుం జారీచేశారు. దీంతో చేసేదిలేక స‌ద‌రు మ‌హిళ భ‌ర్త‌ను భుజాల‌పై ఎక్కించుకుని ఊరంతా తిప్పింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఝ‌బ్వా జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

ఝ‌బ్వా జిల్లా పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధిత మ‌హిళ జూన్ 13 నుంచి క‌నిపించ‌కుండా పోయింది. శుక్ర‌వారం తిరిగొచ్చింది. దీంతో స‌ద‌రు మ‌హిళ బావ‌లు, మ‌రుదులు పంచాయ‌తీ పెట్టారు. ఆమెతో త‌మ సోద‌రుడు తిరిగి కాపురం చేయాలంటే అత‌డిని భుజాలపై ఎత్తుకుని ఊరు చుట్టూ తిరిగి రావాల‌ని హుకుం జారీచేశారు. దీంతో ఆమె భ‌ర్త‌ను భుజాల‌పై ఎత్తుకుని ఊరుచుట్టూ తిరిగి వ‌చ్చింది. 

కాగా, ఈ ఘ‌ట‌నపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌ప్పుచేసింద‌న్న కార‌ణంతో ఓ మ‌హిళ‌ను ఊరంద‌రి ముందు అవ‌మానించ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు. స‌ద‌రు మ‌హిళ భ‌ర్త‌, అత‌ని సోద‌రులు మాత్రం ఆమెకు మ‌రో వ్య‌క్తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన ఝ‌బ్వా జిల్లా పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.     logo