సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 12:05:32

క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌ప‌ట్ల డాక్ట‌ర్ అస‌భ్య ‌ప్ర‌వ‌ర్త‌న‌

క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌ప‌ట్ల డాక్ట‌ర్ అస‌భ్య ‌ప్ర‌వ‌ర్త‌న‌

న్యూఢిల్లీ: క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌ప‌ట్ల ఒక డాక్ట‌ర్ అస‌భ్యంగా ‌ప్ర‌వ‌ర్తించాడు. నోయిడాలోని ద‌వాఖాన‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఐసొలేష‌న్ వార్డులో ఉంటున్న క‌రోనా సోకిన మ‌హిళ‌ప‌ట్ల అక్క‌డే ఉంటున్న వైద్యుడు ఆమెను లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అద‌న‌పు డీఎస్పీ రణవిజయ్ సింగ్ తెలిపారు. ఆ డాక్ట‌ర్‌ కూడా క‌రోనా పాజిటివ్ అని, ఆ ద‌వాఖాన‌లోని ఐసొలేష‌న్ వార్డులోనే అత‌డు ఉంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా కాలంలోనూ మ‌హిళ‌ల ప‌ట్ల అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఐసొలేష‌న్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాల్లోని మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడు‌ల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల వెలుగుచూస్తున్నాయి. logo