మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 10:10:46

కుక్క మొరిగితే మహిళను కొట్టారు.. ఆమెకు గుండెపోటు

కుక్క మొరిగితే మహిళను కొట్టారు.. ఆమెకు గుండెపోటు

ముంబయి : ఓ కుక్క నిరంతరం మొరుగుతుందని.. దాని యజమానురాలిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో నిన్న చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మహిళను కుక్కను పెంచుకుంది. ఇతరులను చూస్తే ఆ శునకం నిరంతరం మొరుగుతూనే ఉంటుంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన పక్కింటివారు కుక్క యజమానురాలిని కొట్టారు. దాడి చేసిన కాసేపటికే ఆమెకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితురాలు చనిపోయిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo
>>>>>>