మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Jul 10, 2020 , 12:09:56

మరో అంతుచిక్క‌ని వ్యాధి.. కరోనా కంటే ప్రమాదకారి

మరో అంతుచిక్క‌ని వ్యాధి.. కరోనా కంటే ప్రమాదకారి

హైద‌రాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ క‌జ‌కిస్థాన్‌లో మ‌రో అంతుచిక్క‌ని వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నార‌ని, అందువ‌ల్ల జాగ్రత్తగా ఉండాలని చైనా ఆ దేశ‌ ప్రజలను హెచ్చరించింది. క‌జ‌కిస్థాన్‌లో గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియా లాంటి ల‌క్ష‌ణాల‌తో గ‌త నెల‌లో 600 మంది మరణించినట్లు వెల్లడించింది. 

క‌రోనా కంటే అత్యంత ప్రమాద‌కారి అయిన‌ ఈ వైరస్‌ వ్యాప్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని క‌జ‌కిస్థాన్‌లో నివసిస్తున్న చైనీయులను కూడా చైనా హెచ్చరించింది. కాగా, అంతుచిక్కని వ్యాధితో గత ఆరు నెలల్లో 1772 మంది మరణించార‌ని, ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారని చైనా తెలిపింది. మృతుల్లో చైనీయులు కూడా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. వైర‌స్‌ను గుర్తించేందుకు ఆరోగ్యశాఖ వ‌ర్గాలు ప్ర‌య‌త్నిస్తున్నా ఇంత‌వ‌ర‌కు గుర్తించ‌లేక ‌పోయాయ‌ని క‌జ‌కిస్థాన్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo