సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 18:17:59

కెమిక‌ల్ ట్యాంక‌ర్ బోల్తా.. తృటిలో త‌ప్పిన పెను ముప్పు!

కెమిక‌ల్ ట్యాంక‌ర్ బోల్తా.. తృటిలో త‌ప్పిన పెను ముప్పు!

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని థానే న‌గ‌రంలో తృటిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. గైముక్ చౌప‌ట్టి స‌మీపంలోని ఘోడ్‌బంద‌ర్ రోడ్డులో కెమిక‌ల్ ట్యాంక‌ర్ బోల్తాప‌డింది. సాధార‌ణంగా కెమిక‌ల్ ట్యాంక‌ర్‌లు బోల్తాప‌డితే ఒత్తిడి కార‌ణంగా అందులోని కెమిక‌ల్ పేలుడుకు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. అదేగ‌నుక జ‌రిగితే ప‌రిస్థితి ఘోరంగా ఉండేది. అత్యంత ర‌ద్దీగా ఉండే ర‌హ‌దారిలో ఘోర‌మైన దృశ్యాలు చూడాల్సిన ప‌రిస్థితి త‌లెత్తేది. 

అందుకే కెమిక‌ల్ ట్యాంక‌ర్ బోల్తాప‌డిన స‌మాచారం అంద‌గానే స్థానిక పోలీసులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చి ఫైర్ ఇంజిన్ల‌ను ర‌ప్పించారు. ట్యాంక‌ర్ బోల్తాప‌డిన వైపు ర‌హ‌దారిని మూసివేసి రెండు లైన్ల‌లో వ‌చ్చే వాహ‌నాల‌ను ఒకే లైన్‌లోకి మ‌ళ్లించారు. కాగా, ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణహానిగానీ, గాయాలుకానీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంక‌ర్‌లో మిథైల్ మిథాక్రైలేట్ అనే కెమిక‌ల్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.   


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo