సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 13:40:56

దాహాన్ని తీర్చుకోవడానికి ఈ పక్షి ఏం చేసిందో... చూడండి...!

దాహాన్ని తీర్చుకోవడానికి ఈ పక్షి ఏం చేసిందో... చూడండి...!

హైదరాబాద్ : కాకి కథలో దాహంతో ఉన్న సమయంలో ఆ కాకి ఏం చేసి తన దాహం తీర్చుకున్నదో... తెలుసు కదా...! ఇక్కడ కూడా అదే సూత్రాన్ని అప్లై చేసి తన దాహార్తిని తీర్చుకున్నది. కాకి జాతికి చెందిన మాగ్పీ అనే పక్షి కూడా ఇదే పని చేసింది. కాకి తరహాలోనే అది కూడా తన దప్పికను తీర్చుకోడానికి ప్రయత్నం చేసింది. రోడ్డుపై నీళ్ల బాటిల్లో రాళ్లు వేసి అడుగున ఉన్న నీటిని పైకి తెచ్చింది. పైకి వచ్చిన నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నది మాగ్పీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజ న్స్ ఆశ్చర్య పోతున్నారు.