మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 10:15:00

అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి

అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి

అనంతనాగ్‌ : సోమవారం ఉదయం ఉగ్రవాదులు, కశ్మీర్‌ భద్రతాదళాల మధ్య అనంతనాగ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ దాడుల్లో పరస్పర కాల్పులు జరిగినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అనంతనాగ్‌ జిల్లాలోని శ్రీగుఫ్‌వరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొద్దున్నే కాల్పులు ప్రారంభం కావడంతో ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo