సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 13:38:16

ఉగ్రవాదుల డంప్‌ ధ్వంసం

ఉగ్రవాదుల డంప్‌ ధ్వంసం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురాలో ఉగ్రవాదుల డంప్‌ను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇవాళ ఉదయం పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదుల డంప్‌ను బలగాలు గుర్తించాయి. అనంతరం ఆ డంప్‌ను ధ్వంసం చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన వస్తువులతో పాటు ఆయుధాలు, ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫూంచ్‌ జిల్లాలోని షాహ్‌పూర్‌, కిర్ని సెక్టార్‌లో పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. మోర్టార్‌ షెల్స్‌తో దాడి చేసింది పాకిస్తాన్‌ సైన్యం. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. logo