ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 12:27:15

జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల డంప్ స్వాధీనం

జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల డంప్ స్వాధీనం

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల డంప్‌ను బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. మెహంద‌ర్‌లోని క‌లాబ‌న్ ఏరియాలో ఆర్మీ, స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ బ‌ల‌గాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వ‌హించాయి. నిన్న రాత్రి క‌లాబ‌న్ ఏరియాలో ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బ‌ల‌గాలు సీజ్ చేశాయి.  

బుద్గాం జిల్లాలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బ‌ల‌గాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు క‌లిసి సంయుక్తంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో గాలింపు బృందాల‌‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్ర‌తిగా భ‌ద్ర‌తా ద‌ళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయ‌ని జ‌మ్ము పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. వారు ఏ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌వారనే విష‌యాన్ని గుర్తించాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.