గురువారం 16 జూలై 2020
National - Jul 01, 2020 , 10:11:06

పోలీసుల కోసం ఫేస్‌షీల్డ్‌లు తయారు చేసిన పదో తరగతి విద్యార్థి

పోలీసుల కోసం ఫేస్‌షీల్డ్‌లు తయారు చేసిన పదో తరగతి విద్యార్థి

న్యూ ఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతబడడంతో చాలామంది పిల్లలు ఇంట్లో ఉండి కాలయాపన చేశారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి మాత్రం కొవిడ్‌19 నివారణలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల కోసం ఫేస్‌షీల్డులు తయారుచేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించాడు. 


ఢిల్లీకి చెందిన పదో తరగతి విద్యార్థి జారెబ్‌వర్ధన్ 3డీ ప్రింటర్లను ఉపయోగించి ఈ రక్షణ మాస్కులను తయారుచేశాడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ ఫేస్‌షీల్డ్స్‌ కరోనా బారిన పడకుండా కాపాడుతుందని జారెబ్‌ తెలిపాడు. సొంత ఖర్చుతో 3డీ ప్రింటర్ కొనుగోలు చేసి తన రీడింగ్‌ రూంను పూర్తిగా ఫేస్‌షీల్డులు తయారు చేయడానికి ఉపయోగించాడు. యంత్రాన్ని ఉపయోగించి ఒకే రోజులో 10కి పైగా ఫేస్ షీల్డ్స్ తయారు చేయొచ్చని జారెబ్‌ చెప్పాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ్‌కు 100 ఫేస్ షీల్డులను తయారు చేసి విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ్‌ జారెబ్‌కు లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 

ఇంకా అధునాతన N-95 మాస్కులను కూడా తయారుచేసే పనిలో ఉన్నానని పోలీసులకే కాకుండా, డాక్టర్లు, కొవిడ్‌19తో పోరాడే ఇతర సిబ్బందికి సైతం ఇవి అందజేయనున్నట్లు జారెబ్‌ పేర్కొన్నారు. logo