గురువారం 04 జూన్ 2020
National - May 19, 2020 , 11:02:11

ఒడిశా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు

ఒడిశా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు

భువనేశ్వర్‌ :  పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను పెను తుపానుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒడిశాకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు చేరుకున్నాయి. కేంద్రపార, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల్లో అంఫాన్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భువనేశ్వర్‌ ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్‌ ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. ఈ క్రమంలో జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు దిగాయి. తుపాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు ప్రకటించాయి. 


logo