e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Covishield: డెల్టా వేరియంట్‌ను నిలువ‌రిస్తున్న కోవీషీల్డ్- స్ట‌డీ రిపోర్ట్‌

Covishield: డెల్టా వేరియంట్‌ను నిలువ‌రిస్తున్న కోవీషీల్డ్- స్ట‌డీ రిపోర్ట్‌

లండ‌న్‌: డెల్టా వేరియంట్ ( Delta Variant ) ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌డ‌పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వైర‌స్ వేరియంట్ ప్ర‌తి ఒక్క‌ర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఆ వేరియంట్‌ను కోవీషీల్డ్ ( Covishield ) టీకాలు అడ్డుకుంటున్న‌ట్లు ఓ స్ట‌డీ ద్వారా తెలుస్తోంది. వాస్త‌వానికి కోవిడ్ టీకాలు వేసుకుంటున్న వారిలోనూ డెల్టా వేరియంట్ కొంత ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. మ‌రో వైపు కోవీడ్ టీకాల కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది. బ్రిట‌న్‌లో ఇటీవ‌ల‌ థార్డ్ వేవ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకోవారిలోనే డెల్టా ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. నిజానికి డెల్టా వేరియంట్ ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉందంటే.. కోవిడ్ టీకా తీసుకున్న వారి ఇమ్యూనిటీ కూడా దాని ముందు ప‌నిచేయ‌డంలేదు. తాజాగా ఇంగ్లండ్‌లో జ‌రిగిన స‌ర్వే కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తేల్చింది. సుమారు 98 వేల మంది శ్యాంపిళ్ల‌ను ఆ స్ట‌డీ కోసం స‌ర్వే చేశారు. 12 నుంచి 24 మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారిలోనూ డెల్టా వేరియంట్ ప్ర‌భావం చూపిన‌ట్లు గుర్తించారు. డెల్టా వేరియంట్‌ను అడ్డుకునే వ్యాక్సిన్ల‌ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా ప‌రిశోధ‌కులు చెప్పారు.

- Advertisement -

క‌రోనా వైర‌స్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్ చాలా తీవ్ర స్థాయిలో మ్యుటేట్ అయ్యింద‌ని, అది ఎంత‌లా రూపాంతరం చెదిందంటే, టీకాల వ‌ల్ల ఉత్ప‌త్తి అయ్యే యాంటీబాడీలు కూడా ఆ ప్రోటీన్ల ముందు నిష్ప్ర‌యోజ‌నంగా మారుతున్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. రియాక్ట్‌-1 పేరుతో ప‌రిశోధ‌కులు స్ట‌డీ చేశారు. జూన్ 24 నుంచి జూలై 12 మ‌ధ్య ఆ స‌ర్వే చేప‌ట్టారు. నిజానికి ఆ స‌మ‌యంలో యూకేలో ఇన్‌ఫెక్ష‌న్లు భారీ స్థాయిలో పెరిగాయి. తొలుత న‌మోదు అయిన ఆల్ఫా స్ట్రెయిన్‌ను మించి డెల్టా స్ట్రెయిన్ బ్రిట‌న్‌లో దూకుడు పెంచింది. దీంతో అక్క‌డ మ‌ళ్లీ పాజిటివ్ కేసులు వేగంగా విస్త‌రించాయి.

అధిక స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లోనూ, పూర్తిగా వ్యాక్సినేట్‌ అయిన‌వారిలోనూ కొత్త‌గా ఇన్‌ఫెక్ష‌న్లు న‌మోదు అవుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 13 శాతం మంది మాత్ర‌మే పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు. మ‌రోవైపు బ్రిట‌న్ ప‌రిశోధ‌కులు ఓ ప్ర‌త్యేక స్ట‌డీ చేశారు. న్యూట్ర‌లైజేష‌న్ ఆఫ్ డెల్టా వేరియంట్ విత్ సెరా ఆఫ్ కోవీషీల్డ్ వ్యాక్సిన్ అన్న అంశంపై ప్ర‌త్యేకంగా నివేదిక‌ను రూపొందించారు. ఆ నివేదిక ప్ర‌కారం .. భార‌త్‌లో త‌యార‌వుతున్న కోవీషీల్డ్ టీకా ఒక్క‌టి మాత్ర‌మే డెల్టా వేరియంట్‌ను కొంత మేర అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఒక డోసు లేదా రెండు డోసుల కోవీషీల్డ్ టీకా తీసుకున్న‌వారిలో డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు బ్రిట‌న్ ప‌రిశోధ‌కులు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టాను నిలువ‌రించే సామ‌ర్థ్యం ఇంకా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana