గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 11:53:28

ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వరుస సమావేశాలు

ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వరుస సమావేశాలు

  • జూన్‌ 30 వరకు ఢిల్లీలో ఇంటింటి సర్వే పూర్తి కావాలి..
  • హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా
  • కరోనా వ్యాప్తిపై విస్తృతస్థాయి సమావేశం

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులను నివారించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం కూడా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా ఎన్‌ఐటీఐ ఆయోగ్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌ డీజీ, ఢిల్లీ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. 

జూన్‌ 21న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే పనిని హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా సమీక్షించారు. నిర్ణయాలు, సజావుగా, సకాలంలో అమలవుతున్నాయని ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో డోర్ టూ డోర్‌ సర్వే జూన్‌ 30 లోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌19 సంబంధిత పనుల కోసం జిల్లా స్థాయి బృందాలను సైతం ఆయన ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు మాట్లాడుతూ కంటైన్‌మెంట్‌ జోన్‌లతో సహా క్లస్టర్‌ ప్రాంతాన్ని రీ షెడ్యూల్‌ చేసే పనులు జూన్‌ 26లోగా పూర్తవుతాయని తెలిపారు. 

సెరోలాజికల్‌ సర్వేను ఎన్‌సీడీసీ, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జూన్‌ 27 నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వే చేయనున్న బృంధాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉంచారు. 

ఢిల్లీలో కరోనా  వైరస్‌  వేగంగా  వ్యాపిస్తుంది. 24 గంటల్లో 3390 మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడింది. దీంతో పాటు మొత్తం రోగుల సంఖ్య 74వేలకు చేరింది. 24 గంటల్లో సుమారు 64 మంది రోగులు కరోనాతో మరణించారు. 


logo