గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 17:09:20

మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్న యముడు

మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్న యముడు

న్యూఢిల్లీ: మాస్కులు ధరించని వారికి యమధర్మరాజు వేషధారి జరిమానా విధిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అక్కడ ఇటీవల కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దీంతో కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజలకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని కోసం పోలీసులు, స్థానిక ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉద్యోగి ఒకరు యముడు వేషం వేశారు. పోలీసులతో కలిసి పలు చోట్ల తిరుగుతూ మాస్కులు ధరించని, కరోనా నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు.


కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు యముడు వేషం వేసిన ఉద్యోగి తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.68 లక్షలకు చేరగా ఇప్పటి వరకు 5,193 మంది మరణించారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo