మంగళవారం 14 జూలై 2020
National - Jun 21, 2020 , 19:21:58

క్వారంటైన్ సెంట‌ర్ గా 19 అంత‌స్తుల భ‌వ‌నం

క్వారంటైన్ సెంట‌ర్ గా 19 అంత‌స్తుల భ‌వ‌నం

ముంబై : మ‌హారాష్ర్ట ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లోనే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా పాజిటివ్ కేసుల్లో మొద‌టి స్థానంలో ఉన్న మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,28,205 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 5,984 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో.. ఆ రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు స‌రిపోవ‌డం లేదు. క్వారంటైన్ సెంట‌ర్లు కూడా స‌రిపోయిన‌న్ని లేవు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌యివేటు బిల్డ‌ర్ త‌న ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నాడు. గ్రేట‌ర్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు త‌న 19 అంత‌స్తుల భ‌వ‌నాన్ని అప్ప‌గించేందుకు బిల్డ‌ర్ మెహుల్ సంఘ్వి సిద్ధ‌మ‌య్యాడు. ఈ భ‌వ‌నాన్ని క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చ‌నున్నారు. ఈ అంతస్తుల్లో ఉండే కిరాయిదారుల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే క్వారంటైన్ సెంట‌ర్ కు ఇచ్చేందుకు నిర్ణ‌యించామ‌ని సంఘ్వీ తెలిపారు. 

ముంబైలో అత్య‌ధికంగా 65,329, థానేలో 23,212, పుణెలో 15,286, ఔరంగాబాద్ లో 3,273, పాల్గ‌ర్ జిల్లాలో 3,225 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo