ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 09:20:59

కాన్పు కోసం వెళ్తే కాటికి పంపారు

కాన్పు కోసం వెళ్తే కాటికి పంపారు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా కాన్పు కోసం వెళ్లిన కాటికి పోవాల్సి వ‌చ్చింది. బిడ్డ త‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళ స్పృహ కోల్పోయిన స్థితిలో కాన్పు క‌ష్టంగా ఉందంటూ పెద్దాస్ప‌త్రికి సిఫార‌సు చేశారు. అంబులెన్స్ స‌మ‌కూర్చ‌మంటే లేద‌ని చెప్పారు. దీంతో ఈ-రిక్షాలో మాట్లాడుకుని తీసుకెళ్లేలోపే త‌ల్లీ, పిల్ల ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీర‌ట్ జిల్లాలోని హాపూర్ ఏరియాలో గురువారం మ‌ధ్యాహ్నం ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గురువారం మ‌ధ్యాహ్నం హాపూర్‌కు చెందిన మ‌హిళ‌కు పురిటి నొప్పులు రావ‌డంతో ఆమె కుటుంబస‌భ్యులు స్థానికంగా ఉన్న క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్క‌డ వైద్య స‌ద‌రు మ‌హిళ‌ను లోప‌లికి తీసుకెళ్లి కాన్పు కోసం ప్ర‌య‌త్నించారు. బిడ్డ త‌ల‌ను బ‌య‌ట‌కు తీశారు. కానీ పూర్తి శ‌రీరాన్ని తీయ‌లేక‌పోయారు. ఈ స్థితిలో త‌ల్ల‌డిల్లిన మ‌హిళ స్పృహ కోల్పోయింది. దీంతో కాన్పు క‌ష్టంగా ఉంద‌ని, వెంట‌నే మీర‌ట్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని క‌మ్యూనిటీ హెల్త్‌ సెంట‌ర్ వైద్యులు మ‌హిళ కుటుంబ‌స‌భ్యుల‌కు సూచించారు. 

దీంతో క‌నీసం అంబులెన్స్ సౌక‌ర్య‌మైనా క‌ల్పించాల‌ని మ‌హిళ కుటుంబ‌స‌భ్యులు క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ సిబ్బందిని అర్థించారు. వారు అంబులెన్స్ లేద‌ని చెప్ప‌డంతో ఈ-రిక్షా మాట్లాడుకుని మీర‌ట్ ఆస్ప‌త్రికి బ‌య‌లుదేరారు. అయితే మార్గ‌మ‌ధ్య‌లోని త‌ల్లీబిడ్డ ఇద్ద‌రూ మ‌ర‌ణించ‌డంతో ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ సూప‌రిండెంట్‌ను వివ‌ర‌ణ కోర‌గా.. మా వైపు త‌ప్పేమీ లేద‌ని, మా ప్ర‌య‌త్నం మేం చేశామ‌ని తెలిపారు. అంబులెన్స్ విష‌యం ప్ర‌స్తావించ‌గా.. మేం అంబులెన్స్ పిలిపిస్తామ‌ని చెప్పినా విన‌కుండా మ‌హిళ కుటుంబ‌స‌భ్యులు రి-రిక్షాలో తీసుకెళ్లార‌ని చెప్పారు. 


కాగా, మృతురాలి భ‌ర్త ర‌హీముద్దీన్ మాత్రం క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే త‌న భార్యాబిడ్డ‌లు చ‌నిపోయారని ఆరోపించారు. మేం ఆరోగ్య కేంద్రానికి వెళ్ల‌గానే పురిటి నొప్పుల‌ను ప్ర‌రేపించే మందులు ఇచ్చి లోప‌లికి తీసుకెళ్లార‌ని, కాసేప‌టికే కాన్పు క‌ష్టంగా ఉంది మీర‌ట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లమ‌ని చెప్పార‌ని ఆయ‌న తెలిపారు. అప్ప‌టికే బిడ్డ త‌లభాగం బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంద‌ని, త‌న భార్య స్పృహ కోల్పోయి ఉంద‌ని చెప్పారు. అంబులెన్స్ ఇవ్వ‌మ‌న్నా లేద‌న్నార‌ని, దాంతో ఈ-రిక్షా మాట్లాడుకుని వెళ్లేలోపు ఘోరం జ‌రిగింద‌ని ర‌హీముద్దీన్ తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo