గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 16:51:50

సోనియా, రాహుల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌

సోనియా, రాహుల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీతోపాటు కొందరు నేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బుధవారం ఓ పిటిషన్‌ దాఖలైంది. 2008లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం, చైనా మధ్య జరిగిన ఒక ఒప్పందాన్ని ఓ న్యాయవాది కోర్టులో సవాల్‌ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 కింద ఆ ఒప్పందంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు.

లఢక్‌ సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో సోనియా, రాహుల్‌ ఇటీవల మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాతో గతంలో జరిగిన ఓ ఒప్పందానికి సంబంధించి వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 
logo