మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 17:08:35

కుక్కలు కూడా క్రికెట్‌ ఆడుతాయి.. వీడియో వైరల్‌!

కుక్కలు కూడా క్రికెట్‌ ఆడుతాయి.. వీడియో వైరల్‌!

న్యూఢిల్లీ:  ఇది ఐపీఎల్‌ సీజన్‌.. ఎక్కడ చూసినా క్రికెట్‌ ముచ్చట్లే. కాగా, సోషల్‌మీడియాలో కూడా ఓ మనిషి కుక్కలతో క్రికెట్‌ ఆడే వీడియో వైరల్‌ అవుతోంది. మనిషిని కుక్క ఔట్‌ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘బిల్కులేమెంటరీ' అనే ఇన్‌స్టా పేజీలో పెట్టిన వీడియో వైరల్‌ అవుతోంది.  

ఈ వీడియోలో ఒక వ్యక్తి మూడు కుక్కలతో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు. ఆ మూడు కుక్కలూ టీ షర్డ్‌లు ధరించి ఫీల్డింగ్ చేస్తున్నాయి. ఆ వ్యక్తి బాల్‌ను కొట్టగానే ఓ కుక్క ప్రొఫెషనల్‌ ప్లేయర్‌లాగా తన రెండు కాళ్లు పైకెత్తి, వెనుక కాళ్లపై నిల్చుని బాల్‌ను నోటితో క్యాచ్‌ చేసింది. ఈ మనిషి, కుక్కల గల్లీ క్రికెట్‌కు న్యూఢిల్లీ వేదికైంది. ఈ మ్యాచ్‌ చూసి, నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్‌ వచ్చాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo