శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 17:02:24

రోడ్డుపై కొండ చ‌రియ‌లు.. రోగికి అవ‌స్థ‌లు!.. వీడియో

రోడ్డుపై కొండ చ‌రియ‌లు.. రోగికి అవ‌స్థ‌లు!.. వీడియో

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో ప‌లుచోట్ల కొండ చ‌రియ‌లు విరిగి రోడ్ల‌పై ప‌డుతున్నాయి. దీంతో ట్రాఫిక్ భారీ స్తంభించిపోతున్న‌ది. ఈ క్ర‌మంలోనే పితోర్‌గ‌ఢ్ జిల్లా మున్సియారీ ఏరియాలో కొండ‌చ‌రియ‌లు విరిగి ర‌హ‌దారిపై ప‌డ్డాయి. దీంతో మున్సియారీ ఏరియాలోని ఓ గ్రామానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం మూసుకుపోయింది. 

దీంతో ఆ గ్రామంలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తిని ఆస్ప‌త్రికి చేర్చ‌డానికి అత‌ని బంధువులు అష్ట‌క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. చెక్క దుంగ‌ల‌ను స్ట్రెచ‌ర్‌లా క‌ట్టుకుని లోయ‌లు, గుట్ట‌ల గుండా మోసుకుపోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వచ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo