గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 13:31:48

అడ్డుకున్న పోలీసుల‌పైకి క‌త్తి దూసిన రైతు

అడ్డుకున్న పోలీసుల‌పైకి క‌త్తి దూసిన రైతు

న్యూఢిల్లీ:  రిప‌బ్లిక్ డేనాడే రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా చెప్పిన స‌మ‌యం, దారుల్లో కాకుండా ముందుగానే ర్యాలీ మొద‌లుపెట్టి సెంట్ర‌ల్ ఢిల్లీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నించిన రైతుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయ‌డంతోపాటు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. అయితే ఈ సంద‌ర్భంగా కొంద‌రు నిహంగ్ ఆందోళ‌న‌కారులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఖ‌డ్గాల‌ను పోలీసుల‌పై దుయ్యడం గ‌మ‌నార్హం. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఢిల్లీలోకి అక్ష‌ర్‌ధామ్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇక మ‌రోవైపు ఇద్ద‌రు రైతులు ట్రాక్ట‌ర్‌తో స్టంట్లు చేస్తుండ‌గా అది బోల్తా ప‌డింది. నిజానికి ఉద‌యం 11 గంట‌ల‌కు కిసాన్ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. ఉద‌యం 8 గంటల నుంచే వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. 

VIDEOS

logo